Monday, March 10, 2008

"మహరాస్త్ర లో ఉత్తర భారతీయుల పై, బీహరియుల పై దాడి "

...విషయం చదివి మా కొలీగ్ ముకేశ్ కి చెప్పాను హింది లోకి తర్జుమా చేసి .వాడు దానికి ఒక ఏదవ నవ్వు నవ్వి మా Project Leaderతో డిస్కషన్ పెట్టాడు ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే ముకేశ్ ది బీహార్ , మా Lead ది ఉత్తర ప్రదేశ్ మేము పిచ్ఛపాతి మాట్లాడుకుంటూ ఉండగా అకడికి ఇద్దరు మరాఠీలు వచ్చారు. ప్రతి రాస్త్రం లో ఏదో ఒకటి వర్గం మీదో , లేదా ఏదో ఒక కులం మీదొ లేక పరాయి రాస్త్రం వాళ్ళు నీళ్ళు తీసుకుంటునారని, Dam లు కడుతున్నారు అని గొడవలు జరుగుతూనే ఉన్నాయి.
"తెలుగు జాతి మనది నిండు గా వెలుగు జాతి మనది" ఎందుకో ఆ టైమ్ లో నాకు ఈ పాట గుర్తోచింది అంతే, కూర్చున్న వాడిని కూర్చునట్టు ఉండకుండా ఆంధ్ర లో ఇలాంటి గొడవలు ఉండవు, మా వాళ్ళు చాలా Flexible ఎవరు వచ్చిన కలుపుకుంటారు, నీళ్ళ కోసం గొడవ పడరు అన్నాను. దానివి మా మరాఠి కొలీగ్ అవును ఆంధ్ర లో ఇలాంటి గొడవలు ఉండవు అన్నాడు( ఆది విని నాలో తెలుగు వాడు తెగ ఆనంద పడిపోయాడు) వాళ్ళు వేరే రాస్త్రం వాళ్ళని ఏమీ అనరు. వాళ్ళలో వాళ్లకే పడదు, Factionism అని కొట్టుకుంటారు , ప్రత్యేక రాస్త్రం అంటారు , తెలంగాణా వాళ్ళు ఆంధ్ర వాళ్ళని తిట్టుకుంటారు , ఆంధ్ర వాళ్ళు తెలంగాణా వాళ్ళని తిట్టుకుంటారు ఆంటే కానీ బయట వాళ్ళని ఏమీ అన్నారు అన్నాడు. ఆది విని నాకు నోట మాట రాలేదు , ఒక వెర్రి నవ్వు తప్ప.

అందరు వెళ్ళిపోయాక అలోచించాను వాడు మనల్ని తిట్టాడా లేక పొగిడాదా అని !!!!!!!!!!!!!!!

Wednesday, March 05, 2008

ఇటీవల భారత తంతి తపాల శాఖ వారు విడుదల చేసిన శ్రీ దామోదరం సంజీవయ్యా గారి స్టాంప్ ఇది
గూగుల్ పుణ్యమా అని మరి కాస్త వివరం దొరికింది
దామోరం సంజీవయ్యా ఫిబ్రవరి 4, 1922 లో కర్నూలు జిల్లా పెద్దపాడు అనే కుగ్రామం లో పుట్టారు. శ్రీ మునయ్య శ్రీమతి సూంకుళమ్మ వారి తల్లితండ్రులు. అదే గ్రామం లో పటాశాల వరుకూ చదివి, తర్వాత కర్నూలు లో హై స్కూల్ లో, అటు పిమ్మట అనంతపూర్ లో ఆర్ట్స్ కాలేజ్ నుంచి డిగ్రీ లో పట్టభద్రులయ్యారు. 1950 లో ఆయన మెంబర్ ఒఫ్ పార్లిమెంట్ గా ఎన్నిక కావటం తో ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది, 1952 లో పాతికొండ నియోజకవర్గం నుంచి మదరసు అసెంబ్లీ కి ఎన్నికిన ఇద్దరు వ్యక్తులలో సంజీవయ్యా గారు ఒకరు. అప్పటి ముఖ్యమంత్రి అయిన సీ. రాజగోపాలాచారి గారు ఆయన్ని తన మంత్రి వర్గం లో తీసుకున్నారు. 1953 లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటి ముఖ్యమంత్రి అయిన టంగుటూరి ప్రకాశం గారి హయాము లో కూడా మంత్రి గా పనిచేశారుజవహార్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ మంత్రి వర్గం లో పలు ముఖ్య పదవులు నిర్వర్తించి ఆ పదవులకే వన్నె తెచ్చారు మన తెలుగు తేజం సంజీవయ్యా గారు. లేబర్ మినిస్టర్ గా చేసి ప్రజల మనిషి అనిపించుకున్న గొప్ప వ్యక్తి, సమకాలీన తెలుగు రాజకీయ నాయకుల్లో ఆయన పేరు చిరస్మరణీయం గా మిగిలిపోతుంది.