Tuesday, January 06, 2015

తెలుగు చ్యానెల్స్ !!

తెలుగులో ఉన్న‌న్ని న్యూస్ ఛాన‌ళ్లు వేరే ఏ భాష‌లో ఉండవేమో…!  ర‌క‌ర‌కాల పేర్లు, ర‌క‌రకాల రంగులు, ర‌క‌ర‌కాల రాత‌లు. ఇవ‌న్నీ ఒకటైతే… మళ్లీ మ‌రో ఛాన‌ల్ పెట్టాలంటే ఏం పేరు పెట్టాల‌బ్బా అని ఆలోచించుకోవాల్సిన ప‌రిస్థితి. ఎందుకంటే ఛాన‌ళ్ల‌కు అంకెలు పెట్టుకోవ‌డం బాగా ప‌రిపాటి అయిపోయింది. అందులోనూ 1 నుంచి 9 వ‌ర‌కు ఉన్న అంకెలైతే మ‌రీ Crazuu !
మ‌న తెలుగులో చూస్తే న్యూస్ ఛాన‌ళ్లు చాలానే ఉన్నాయి. వీటిలో నంబ‌ర్ల‌తో ఉన్న ఛాన‌ళ్లను చూద్దాం. మొద‌ట 1తో మొదలు పెడితే, ఆ పేరుతో Already రెండు ఛాన‌ళ్లు న‌డుస్తున్నాయి. ఒక‌టి న్యూసైతే, మ‌రొక‌టి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌. టీవీ9కి అనుబంధంగా న‌డుస్తున్న టీవీ 1 మొద‌టి సంఖ్య‌ను లాక్కుంది, of course ఆది ఇప్పుడు జై తెలంగాణా అయ్యింది అనుకోండి ఒక స్టూడియో ఎన్ వారి ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛాన‌ల్ స్టూడియో 1 కూడా ఒక‌టిని పంచుకుంది. so న్యూస్, ఎంట‌ర్‌టైన్‌మెంట్ విభాగాల్లో ఒక‌టో నెంబ‌ర్ ఖాళీ లేదు.
ఇక రెండు. ఈ నెంబ‌ర్‌తో 2003లోనే ఛాన‌ల్ స్టార్టైంది. అదే ఈటీవీ 2. ఈటీవీ ఆల్రెడీ ఉంది కాబ‌ట్టి, ఆ బ్రాండ్ ప్ర‌తిబింబించే పేరు పెట్టాలి, ఈటీవీకి రెండు అంకెని చేర్చి ఈటీవీ 2 పెట్టారు, ఇదే ఇపుడు ఈటీవీ ఆంధ్రప్రదేశ్ అయ్యింది  అలా రెండో నెంబ‌ర్‌ను ఈటీవీ గ్రూప్ లాగేసుకుంది. ఇక మూడు. దీన్ని కూడా ఈటీవీ గ్రూపే దోచేసుకుంది. తెలంగాణ కోసం ఈ మ‌ధ్య‌నే ప్రారంభ‌మైన ఈటీవీ 3 మూడును త‌న‌లో ఇముడ్చుకుంది.
త‌ర్వాత సంఖ్య 4. ఈ పేరుతో కొంత కాలం క్రితం ఒక ఛాన‌ల్ మొద‌లైంది. అలే ఛాన‌ల్ 4.  మాజీ మంత్రి ఏరాసు ప్ర‌తాప‌రెడ్డి ఛాన‌ల్ అని అప్ప‌ట్లో చెప్పుకున్నారు. అయితే ఆచూకీ లేకుండా పోయింది. కానీ నంబ‌ర్ మాత్రం వాడుకోవ‌డం జ‌రిగిపోయింది. త‌ర్వాత సంఖ్య అయిదు. ఇది మ‌నంద‌రికీ బాగా తెలుసు. టీవీ9కి పోటీగా వ‌చ్చిన బి ఆర్ నాయుడి  ఛాన‌ల్ టీవీ 5 త‌న‌లో అయిదు నంబ‌ర్‌ను దాచుకుంది.
ఇక నంబ‌ర్ 6.  ఈ సంఖ్య‌ను రెండు ఛాన‌ళ్లు పంచుకున్నాయి. తెలంగాణ కోసం విశాఖ ఇండ‌స్ట్రీస్ అధిప‌తి, ఎంపీ వివేక్ ఈ ఛాన‌ల్‌ను పెట్టారు. వారు పెట్టుకున్న ప‌రిశ్ర‌మ‌ల్లో ఇది ఆరోది అనే లెక్కా లేక ఆ కుటుంబంలో ఆరుగురు సభ్యులు
V తో మొదలయ్యే అక్షరం తో  Lucky Number అనో కానీ ఉన్న మొద‌టి Letter Vని తీసుకుని దాని ప‌క్క‌న 6 పెట్టుకున్నారు. దీంతో ఆరో నంబ‌ర్ Occupy అయిపోయింది. అయితే మీరు ఆరుకి ముందు వీ పెట్టుకుంటే మేం దాని త‌ర్వాత టీవీని పెట్టుకుంటామంటూ మ‌రో ఛాన‌ల్ వ‌చ్చింది. అదే  నిజామాబాద్ కి చెందిన ఎన్ ఆర్ ఐ సురేష్ రెడ్డి 6టీవీ.
ఇక త‌ర్వాత‌ది 7. హెల్త్ కోసం ప్రారంభ‌మైన మొట్ట‌మొద‌టి న్యూస్ ఛాన‌ల్ టీవీ7 ఏడుని వాడేసుకుంది. ఇక 9 గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. 9 అంటేనే ఫ్యాన్సీ నంబ‌ర్‌. దీన్ని టీవీ9 ఏనాడో లాగేసుకుంది. అందుకే తాజాగా వ‌చ్చిన సీపీఐ ఛాన‌ల్ టీవీ 99 అని రెండు తొమ్ముదుల‌ను పెట్టుకుంది. త‌ర్వాత 10. దీనికి సీపీయం పెట్టిన 10టీవీ ఉండ‌నే ఉంది. అంటే మొద‌టి ప‌ది సంఖ్య‌లు ఖాలీ లేవ‌న్న మాటే.
ప‌ప్పులో కాలేశారు అనుకుంటున్నారా? ఎనిమిది మ‌ర్చిపోయాం అనుకుంటున్నారా?  లేదు. ఎనిమిది ఖాళీ ఉంది అనుకుంటే మీరు పొర‌బ‌డిన‌ట్టే. ఎందుకంటే టీవీ 8 వ‌చ్చేస్తోంది. సీనియ‌ర్ పాత్రికేయులు రామ‌క్రిష్ణ‌, కంబాల‌ప‌ల్లి క్రిష్ణ, విజ‌య్‌లు ఆంధ్ర సెట్టిలర్స్ ఫోరమ్ కు చెందిన శ్రీనివాస రాజు ఆధ్వ‌ర్యంలో టీవీ8 ప్రారంభం కానుంది. ఈ ఛాన‌ల్ ఏర్పాటుతో మొత్తం 1 నుంచి 10 వ‌ర‌కు ఉన్న అంకెల‌తో మ‌న తెలుగులో న్యూస్ ఛాన‌ల్స్ న‌డుస్తున్నట్టైంది.
ఇక మిగిలిన‌వి ఆక్ష‌రాలే. ఆల్రెడీ ఏ టీవీ, ఏబీఎన్‌, ఈ టీవీ, ఐ న్యూస్, ఎన్ టీవీ, స్టూడియో ఎన్‌, టీ న్యూస్,  జీ టీవీ, సీవిఆర్, వై టివీ ఇలా ఒక 10 అక్ష‌రాలు అయిపోయాయి. కాబ‌ట్టి మిగిలిన 16 అక్ష‌రాలున్నాయి. ఇవికాక ఇప్పుడు ఎక్స్‌ప్రెస్ టీవీ వ‌చ్చింది కాబ‌ట్టి రానున్న రోజుల్లో డీల‌క్స్‌, హైటెక్, గ‌రుడ‌, గ‌రుడ ప్ల‌స్‌, పాసింజ‌ర్ అంటూ పేర్లు పెట్టుకుని పోటీప‌డినా ఆశ్చ‌ర్యం లేదు.
ఆంధ్ర , తెలంగాణా లో ఉండే వాళ్ళకి ఇంకా ఎక్కువ గా తెలుసుందే అవకాశం ఉంది , DTH కన్నా కేబల్ లో ఎక్కువ గా చ్యానెల్స్ వస్తున్నాయి , ఇంకా మీకు తెలుసున్న చ్యానెల్స్ ఉంటే కామెంట్ చెయ్యండి ,  Research చేసి పోస్ట్ పొడిగిద్డాం 

Monday, December 15, 2014

అనగనగా ఒక రాజు.. ఆ రాజుకి ఏడుగురు కొడుకులు


అనగనగా ఒక రాజు.. ఆ రాజుకి ఏడుగురు కొడుకులు


 ఈ కథ ప్రతి తల్లి, తండ్రి చిన్నపిల్లలకు చెప్పే కథల్లో ముఖ్యమైనది. అందరికి తెలిసినదే. మామూలు కథగా ఆలోచిస్తే ఎదో పిచ్చి కథ అనిపిస్తుంది. ఇది కచ్చితంగా మన జీవితానికి ఎదో సందేశాన్ని ఇస్తుంది. అసలు రాజుగారి కొడుకులు వేటకు వెళ్ళి చేపలు తేవటమేమిటి.. అందులో ఒక చేపే ఎండక పోవటమేమిటి? కారణము గడ్డిమేటు అడ్డంరావటమేమి? అంటే కథలో ఎదో దోషమైనా ఉండాలి, లేదా అవగాహనైనా తేడా ఉండాలి. ఈ కథలోని లోతైన తత్వాన్ని గమనిద్దాం.
కథ:
అనగనగా ఒక రాజు. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు. ఏడుగురు కొడుకులు వేటకు వెళ్ళారు. ఏడు చేపలు తెచ్చారు. ఏడు చేపల్ని ఎండ పెట్టారు. అందులో ఒకచేప ఎండలేదు. చేప చేప ఎందుకు ఎండలేదు. గడ్డిమేటు అడ్డమొచ్చింది. గడ్డిమేటా... గడ్డిమేటా ఎందుకు అడ్డమొచ్చావ్... ఆవు మెయ్యలేదు. ఆవా ఆవా ఎందుకు మెయ్యలేదు... గొల్లవాడు మేపలేదు. గొల్లవాడా... గొల్లవాడా ఎందుకు మేపలేదు... అమ్మ అన్నం పెట్టలేదు. అమ్మా... అమ్మా ఎందుకు అన్నంపెట్టలేదు... పిల్లవాడు ఏడిచాడు. పిల్లవాడా... పిల్లవాడా ఎందుకు ఏడిచావు... చీమ కుట్టింది. చీమా చీమా ఎందుకు కుట్టావ్... నా బంగారు పుట్టలో వేలుపెడితే కుట్టానా... అన్నది.
రాజుగారు అంటే మనిషి. ఏడుగురు కొడుకులు అంటే మనలోని సప్త థాతువులు. వేటకు వెళ్ళటము అంటే జీవనము సాగించటము. జీవితము అనే వేట.
ఏడు చేపలు అనగా మనల్ని పీడించే సప్త వ్యసనాలు (కామము, వేట, జూదము, మద్యపానము, వాక్పారుష్యము (కఠినంగా, పరుషంగా మాట్లాడటం), దండపారుష్యము (కఠినముగా దండించుట), అర్థదూషణము (థనమును దూబారాగా ఖర్చుచేయుట)). ఎండగట్టాటానికి వీలైనది కనుక చేప అని చెప్పబడినది.

వెలది, జూదంబు, పానంబు, వేట,పలుకు పల్లదనంబును, దండంబు బరుసదనము,
సొమ్ము నిష్ప్రయోజనముగ వమ్ము సేత, యనెడు సప్త వ్యసనముల జనదు తగుల.
విదురుడు దృతరాష్టృనికి వ్యసనాల గురించి చెబుతూ చెప్పినది. ప్రస్తుత సమాజములో కూడా ఈ సప్త వ్యసనాలు ఎలా మనిషిని పీడిస్తున్నాయో మనకి తెలియనిది కాదు.

ఎండపెట్టము అంటే వ్యసనాల్ని జయించుట. సాథన చేసి మనిషి తనలోని వ్యసనాలను జయించవచ్చు.
ఒకచేప ఎండలేదు. అంటే సప్తవ్యసనాలలో ఒక్క కామాన్ని తప్ప మిగిలినవాటిని జయించవచ్చును అని చెప్పుటకు ఒక చేప ఎండలేదు అని చెప్పబడినది. కామాన్ని జయించటము చాలా కష్టము. అది ఎప్పటికి ఎండదు. ఇక్కడ కామము అంటే కోరిక... అది ఎలాంటి కోరిక అయినా కావచ్చును. మోక్షాన్ని పొందాలన్నది చాలా ఉత్కృష్టమైనది అయిననూ అదికూడా కొరికే కనుక కామాన్ని జయించుట కుదరని పని. కోరిక ఎండితే కానీ మోక్షము రాదు. కోరిక లేక బంధము తోలగుటయే కదా మోక్షము.

చేప ఎండకపోవటానికి కారణము గడ్డిమేటు. గడ్డిమేటు అజ్ఞానానికి ప్రతీక. మన అజ్ఞానము ఎంత అంటే గడ్డిమేటంత. ఎన్ని గడ్డిపరకలు లాగినా గడ్డిమేటు తరగదు. అలాగే అజ్ఞానము తరగదు. ఎన్ని విన్నా, ఎంత తెలిసినా అజ్ఞానము పీడిస్తూనే ఉంటుంది. చెప్పలేనంత అజ్ఞానము అని చెప్పుటకు గడ్డిమేటును చెప్పారు. సమస్త జ్ఞానము కలిగినా అహంకారము (నేనున్నానన్న భావన) తొలగుట కష్టము. కనుక అజ్ఞానమును గడ్డిమేటుతో పోల్చినారు.
గడ్డిమేటు అడ్డుతగలటానికి కారణము ఆవు మేయక పోవటము. వేదములలో ఆవును జ్ఞానమునకు ప్రతీకగా చెప్పారు. ఇక్కడ ఆవు అనగా జ్ఞానము. జ్ఞానము కలిగినచో అజ్ఞానము తొలగును. ఆవులచే మేయబడినా, అగ్నిచే దగ్దము చేయబడినా గడ్డిమేటు తొలగింపబడుతుంది. "జ్ఞానగ్ని దగ్ధ కర్మాణం" అని భగవద్గీత చెప్పుచున్నది. జ్ఞానమనే అగ్ని చేత మాత్రమే అజ్ఞానము తొలగింపబడుతుంది.
ఆవు ఎందుకు మేయలేదు అంటే గొల్లవాడు మేపలేదు. గొల్లవాడు అనగా సద్గురువు. సద్గురువుచే జ్ఞానము బోధింపబడలేదు కనుగ అజ్ఞానము తొలగలేదు అని అర్థము. సద్గురువు ద్వారానే జ్ఞానము అందింపబడాలి. అప్పుడు మాత్రమే అజ్ఞానము తొలగింపబడి జ్ఞానము కలుగుతుంది. "కృష్ణం వందే జగద్గురుం". జగద్గురువు శ్రీకృష్ణుడే. అతడు గొల్లవాడు కనుక ఇక్కడ గొల్లవాడు అని చెప్పబడినది.
గొల్లవాడు ఎందుకు మేపలేదు అంటే అమ్మ అన్నం పెట్టలేదు. అమ్మ ఇచ్చిన అన్నం తిని, తీసుకొని వెళ్ళి ఆవులను మేపటం అన్నది గోవులు మేపే వాళ్ళ నిత్యకృత్యం. అంటే జగన్మాతచే సద్గురువు పంపబడలేదు అని అర్థము. జగన్మాత ఆజ్ఞలేనిదే సద్గురువును దర్శించుటకాని, ఉపదేశము పొందుటకాని జరుగదు అని తెలుసుకొనవలెను. ఇంకా జ్ఞానమును పొందే సమయము రాలేదు అని అర్థము. దైవానుగ్రహము కలుగలేదు అని అర్థము.
అమ్మ ఎందుకు అన్నం పెట్టలేదు అంటే పిల్లవాడు ఏడ్చాడు. పిల్లవాడు ఏడవటం అంటే జగన్మాత అనుగ్రహము కోసము ఆర్తితో పరితపించటము. అటువంటి వారికి తల్లి మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. అవసరము కోసము ఏడవటము వేరు, అనుగ్రహము కోసము పరితపించటము వేరు. జగత్తంతటికి తల్లి కనుక జ్ఞానము కావాలి అని పరితపించే వారికన్నా, దైవమే కావాలి అని పరితపించేవారిని మొదట అనుగ్రహిస్తుంది జగన్మాత. అంటే అమ్మ ఆజ్ఞ అవలేదు అని అర్థము.
పిల్లవాడు ఎందుకు ఏడ్చాడు అంటే చీమ కుట్టింది. చీమ అంటే సంసారము. సంసారము అంటే కుటుంబము ఒక్కటే కాదు. మనల్ని అంటుకొని ఉన్న సమస్త భావములు కూడా సంసారమే. సంసార, ఈతి భాధలచే దుఃఖము చెంది దైవము కొరకు పరితపించటమే చీమ కుట్టి ఏడవటము.
చీమ కుట్టటానికి కారణము తన బంగారు పుట్టలో వేలు పెట్టుట వలన కుట్టింది. నిజమునకు చీమల పుట్టలన్నీ కూడా మట్టి పుట్టలే. కానీ సంసారము లేకుండా ఎలా అన్న అజ్ఞానంలో కావాలని దాని ఎడల అనురక్తి కలగటమే బంగారు పుట్ట. చివరకు అనురక్తి తొలగి సంసార బాథలనుండి తనను రక్షింపమని దైవము కొరకు జీవుడు పరితపించును.
కథ సారాంశము:
సప్తథాతువులతో కూడిన మనిషి సాథన చేసి సప్త వ్యసనములలో 6 వ్యసనములు జయించిననూ 7వది అయిన కామముకు జయించుట కష్టము. అజ్ఞానము తొలగనిదే కామము జయింపబడదు. జ్ఞానము కలిగినచో అజ్ఞానము తొలగును. జ్ఞానమును ఒక్క సద్గురువు మాత్రమే అందిపగలడు. అట్టి సద్గురువు జీవితమున దైవానుగ్రహమున మాత్రమే లభించగలడు. సంసారమున చిక్కి బాథపడుతున్న జీవుడు దైవము కొరకు పరితపించి, ఆర్తితో తపన చెందుతున్నప్పుడు మాత్రమే దైవానుగ్రహమునకు పాత్రుడు కాగలడు. దైవముచేత పంపబడినవాడే సద్గురువు. అతడు జ్ఞానమును అందించి అజ్ఞానమును తొలగించి జీవుని ఉద్దరించి దైవమును చేర్చును. కనుక సద్గురువు యొక్క ఆవశ్యకత జీవితమున ఎంతైనా ఉన్నది.

అవథాని శ్రీ గరికపాటి నరసింహారావుగారు 2005లో అమెరికాలోని ఆంథ్రులకు శ్రీమద్రామాయణంలోని థర్మసూక్ష్మాలను వివరిస్తూ ఇచ్చిన ప్రసంగంలో  ముఖ్యభాగం

Tuesday, June 30, 2009

మన రాజకీయ నాయకులు

ఇప్పుడు


అప్పుడు



















Saturday, June 20, 2009

తెలుగు జాతి గర్వించదగ్గ దర్శకుల్లో జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి ఒకరు, మనకి జంధ్యాల గా తెలిసిన ఆ హాస్యబ్రహ్మ పేరు వినగానే మనకి ఆహ్లాద భరితమైన ఆనుభూతి కలుగుతుంది.అహా నా పెళ్ళంట, జయంబు నిశ్చ్యంబు రా , చూపులు కలిసిన శుభవేళా వంటి ఆరోగ్య కరమైన హాస్యాన్ని అందించి తన సత్తా చాటుకున్నారు. తెలుగువారిని నిండుగా మెండుగానవ్వించిన హాస్యబ్రహ్మఆయన

పక్క హాస్య చిత్రాలను సృష్టిస్తూనే మరో పక్క ఇతర అంశాలకు చెందినచిత్రాల రూపకల్పన చేసి మంచి కీర్తిని అందుకున్నారు. ఆనందభైరవి,నెలవంక వంటి చిత్రాలే ఇందుకు ఉదాహరణ. రచయత గా కూడా జంధ్యాల తన ఉనికి ని చాటారు, శంకరాభరణం, సప్తపది, జగదేకవీరుడు-ఆతిలొకసుందరి, వేటగాడు ఇలా వైవిద్యమైన రచనల్ని మనకి అందించారు.

ETV లో పొపుల పెట్టె అనే సీరియల్ ద్వారా మనకి బుల్లితెర మీద కూడా తన నవ్వుల జల్లు కురిపించారు, ఆయన రాసిన గుండెలు మార్చబడును అనే నాటిక లో కొటేశ్వర్ రావు అనే పాత్ర ని వేసినందుకు నేను గర్వపడుతున్నాను.

సుమారు 20 సంవత్సరాల పాటు తన రచనలతో, సినిమా లతో, మన అందరి చేత హాస్యప్రాయాణం చేయించిన ఆ హాస్య బ్రహ్మ 2001 జూన్ 19 పరమపదించారు కానీనవ్వులు విరిసినన్నాళ్ళూ ఆయన మన మదిలో నీలేచేవుంటారు


Monday, April 20, 2009

 ఆంద్ర లో ఉచిత విద్యుత్తు

Wednesday, April 15, 2009

ఏ "లక్షణా" లు - II

మీకు తెలుసా !!
తమిళ నాడు లో DMK పార్టీ వాళ్ళు ఫక్తు తమిళ పేర్లు పెట్టుకుంటే ఒక బంగారపు ఉంగరం ఇస్తారుట
ఎలెక్షన్ దగ్గర పదే కొద్ది మన నాయకుల పిచ్చి ముదిరి పాకాన పడింది అనటానికి ఇదొక ఉదాహరణ, తమిళ బాష ని బతికించటానికి మాత్రమే ఈ ఉంగరం స్కీమ్ పెట్టాం అని చెప్పుకుంటునారు ఆ నాయకులు ఇన్ని రోజులు గుర్తూరాని బాష అభినమ్ ఇప్పుడు ఎలా గుర్తు వచిందో ఏలీనా వారికి !!

రాజు తలచుకుంటే దెబ్బలకి కొదవా అనేది పాత మాట రాజకీయ నాయకులు తలచుకుంటే పదకాలకి కొదవా చెప్పండి


ఎలెక్షన్ టైమ్ లో ఓట్ల కోసం నాయకులు ఏమైన చేస్తారు ప్రచారానికి దెన్నిన ఉపయోగించుకుంటారు
అగ్గీపుల్ల కుక్కపిల్ల సబ్బూబిళ్ళ కాదేది కవిత కి అనార్హం అన్నారు శ్రీ శ్రీ గారు

కానీ మన నాయకులు అగ్గిపెట్టె చెట్తబుట్ట రైలుపెట్టె కాదేది ప్రచారానికి అనార్హం అంటున్నారు .. !!!

ఈ కింద ఫోటోలు చూడండి మీకె తెలుస్తుంది










Wednesday, March 18, 2009

ఏ "లక్షణా" లు

ఆంధ్ర లో ఎన్నికల హడావిడి మొదలయ్యింది . నాయకులు, "వి" నాయకులు మైకులు పట్టుకుని రోడ్ షో ల పేరు తో పబ్లిక్ ముందుకు వెళ్తున్నారు . వాళ్ల వాళ్ల ఉక దాంపుడు ఉపన్యసాలతో ప్రజల చెవులు చిరిగిపోయల అరుస్తున్నారు . తమ పార్టీ ఏమీ చేస్తుందో చెప్పడం కంటే పక్క పార్టీ ఏమీ తప్పులు చేసిందో చెప్పటం లో వీళ్ళందరూ సిద్దహస్టులు అనటం లో ఏ మాత్రం సందేహం లేదు.
డబ్బులు సంపాదించటానికి,  ప్రజల నోట్లో నానటానికి మన దేశం లో 3 అత్యంత సులువైన (కొంచెం కస్టమే లెండి...) మార్గాలు ఉన్నాయి.
అవి సినిమా , క్రికెట్ & పాలిటిక్స్
ఈ సారి విశేషం ఏంటి అంటే ఈ మూడు కలిసిపోయాయి              
ఇటు వాళ్ళు అటు అటు వాళ్ళు ఇటు వస్తూనే ఉన్నారు ప్రచారం పేరు తో తిరుగుతూనే ఉన్నారు

ఎవరు ఎవరితో కలుస్టరో, ఎవరు ఎపుడు ఈ పార్టీ లో ఉంటారో దేవుడికే తెలియాలి
లోగుట్తు పెరుమాల్లా కి ఎరుక 

మన ఇంకో 2 నెలలు ఆగితే అందరి జాతకాలు బయట పడతాయి

ఓటు హక్కు ఉన్న వారు దయచేసి మే ఓటు ని వినియోగించామని ప్రార్ధన, అబ్యర్దన

ఈ కింద ఫొటోస్ చూడండి 03/18 వ తారీకున చిరంజీవి కి , NTR కి "సో కాల్డ్ " అభిమానులు ఇచిన బహుమతులు 
వాటి సారూప్యం చూడండి 

బంటూ మిల్లి లో చిరంజీవి కి

Free Image Hosting at www.ImageShack.us


తగరపు వలస లో NTR కి

Image Hosted by ImageShack.us

పూల కిరీటం, చేపలబుట్ట, వల, యాదృుచికమే అయిన ఒకే రోజు ఒకే బహుమతులు