Tuesday, January 06, 2015

తెలుగు చ్యానెల్స్ !!

తెలుగులో ఉన్న‌న్ని న్యూస్ ఛాన‌ళ్లు వేరే ఏ భాష‌లో ఉండవేమో…!  ర‌క‌ర‌కాల పేర్లు, ర‌క‌రకాల రంగులు, ర‌క‌ర‌కాల రాత‌లు. ఇవ‌న్నీ ఒకటైతే… మళ్లీ మ‌రో ఛాన‌ల్ పెట్టాలంటే ఏం పేరు పెట్టాల‌బ్బా అని ఆలోచించుకోవాల్సిన ప‌రిస్థితి. ఎందుకంటే ఛాన‌ళ్ల‌కు అంకెలు పెట్టుకోవ‌డం బాగా ప‌రిపాటి అయిపోయింది. అందులోనూ 1 నుంచి 9 వ‌ర‌కు ఉన్న అంకెలైతే మ‌రీ Crazuu !
మ‌న తెలుగులో చూస్తే న్యూస్ ఛాన‌ళ్లు చాలానే ఉన్నాయి. వీటిలో నంబ‌ర్ల‌తో ఉన్న ఛాన‌ళ్లను చూద్దాం. మొద‌ట 1తో మొదలు పెడితే, ఆ పేరుతో Already రెండు ఛాన‌ళ్లు న‌డుస్తున్నాయి. ఒక‌టి న్యూసైతే, మ‌రొక‌టి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌. టీవీ9కి అనుబంధంగా న‌డుస్తున్న టీవీ 1 మొద‌టి సంఖ్య‌ను లాక్కుంది, of course ఆది ఇప్పుడు జై తెలంగాణా అయ్యింది అనుకోండి ఒక స్టూడియో ఎన్ వారి ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛాన‌ల్ స్టూడియో 1 కూడా ఒక‌టిని పంచుకుంది. so న్యూస్, ఎంట‌ర్‌టైన్‌మెంట్ విభాగాల్లో ఒక‌టో నెంబ‌ర్ ఖాళీ లేదు.
ఇక రెండు. ఈ నెంబ‌ర్‌తో 2003లోనే ఛాన‌ల్ స్టార్టైంది. అదే ఈటీవీ 2. ఈటీవీ ఆల్రెడీ ఉంది కాబ‌ట్టి, ఆ బ్రాండ్ ప్ర‌తిబింబించే పేరు పెట్టాలి, ఈటీవీకి రెండు అంకెని చేర్చి ఈటీవీ 2 పెట్టారు, ఇదే ఇపుడు ఈటీవీ ఆంధ్రప్రదేశ్ అయ్యింది  అలా రెండో నెంబ‌ర్‌ను ఈటీవీ గ్రూప్ లాగేసుకుంది. ఇక మూడు. దీన్ని కూడా ఈటీవీ గ్రూపే దోచేసుకుంది. తెలంగాణ కోసం ఈ మ‌ధ్య‌నే ప్రారంభ‌మైన ఈటీవీ 3 మూడును త‌న‌లో ఇముడ్చుకుంది.
త‌ర్వాత సంఖ్య 4. ఈ పేరుతో కొంత కాలం క్రితం ఒక ఛాన‌ల్ మొద‌లైంది. అలే ఛాన‌ల్ 4.  మాజీ మంత్రి ఏరాసు ప్ర‌తాప‌రెడ్డి ఛాన‌ల్ అని అప్ప‌ట్లో చెప్పుకున్నారు. అయితే ఆచూకీ లేకుండా పోయింది. కానీ నంబ‌ర్ మాత్రం వాడుకోవ‌డం జ‌రిగిపోయింది. త‌ర్వాత సంఖ్య అయిదు. ఇది మ‌నంద‌రికీ బాగా తెలుసు. టీవీ9కి పోటీగా వ‌చ్చిన బి ఆర్ నాయుడి  ఛాన‌ల్ టీవీ 5 త‌న‌లో అయిదు నంబ‌ర్‌ను దాచుకుంది.
ఇక నంబ‌ర్ 6.  ఈ సంఖ్య‌ను రెండు ఛాన‌ళ్లు పంచుకున్నాయి. తెలంగాణ కోసం విశాఖ ఇండ‌స్ట్రీస్ అధిప‌తి, ఎంపీ వివేక్ ఈ ఛాన‌ల్‌ను పెట్టారు. వారు పెట్టుకున్న ప‌రిశ్ర‌మ‌ల్లో ఇది ఆరోది అనే లెక్కా లేక ఆ కుటుంబంలో ఆరుగురు సభ్యులు
V తో మొదలయ్యే అక్షరం తో  Lucky Number అనో కానీ ఉన్న మొద‌టి Letter Vని తీసుకుని దాని ప‌క్క‌న 6 పెట్టుకున్నారు. దీంతో ఆరో నంబ‌ర్ Occupy అయిపోయింది. అయితే మీరు ఆరుకి ముందు వీ పెట్టుకుంటే మేం దాని త‌ర్వాత టీవీని పెట్టుకుంటామంటూ మ‌రో ఛాన‌ల్ వ‌చ్చింది. అదే  నిజామాబాద్ కి చెందిన ఎన్ ఆర్ ఐ సురేష్ రెడ్డి 6టీవీ.
ఇక త‌ర్వాత‌ది 7. హెల్త్ కోసం ప్రారంభ‌మైన మొట్ట‌మొద‌టి న్యూస్ ఛాన‌ల్ టీవీ7 ఏడుని వాడేసుకుంది. ఇక 9 గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. 9 అంటేనే ఫ్యాన్సీ నంబ‌ర్‌. దీన్ని టీవీ9 ఏనాడో లాగేసుకుంది. అందుకే తాజాగా వ‌చ్చిన సీపీఐ ఛాన‌ల్ టీవీ 99 అని రెండు తొమ్ముదుల‌ను పెట్టుకుంది. త‌ర్వాత 10. దీనికి సీపీయం పెట్టిన 10టీవీ ఉండ‌నే ఉంది. అంటే మొద‌టి ప‌ది సంఖ్య‌లు ఖాలీ లేవ‌న్న మాటే.
ప‌ప్పులో కాలేశారు అనుకుంటున్నారా? ఎనిమిది మ‌ర్చిపోయాం అనుకుంటున్నారా?  లేదు. ఎనిమిది ఖాళీ ఉంది అనుకుంటే మీరు పొర‌బ‌డిన‌ట్టే. ఎందుకంటే టీవీ 8 వ‌చ్చేస్తోంది. సీనియ‌ర్ పాత్రికేయులు రామ‌క్రిష్ణ‌, కంబాల‌ప‌ల్లి క్రిష్ణ, విజ‌య్‌లు ఆంధ్ర సెట్టిలర్స్ ఫోరమ్ కు చెందిన శ్రీనివాస రాజు ఆధ్వ‌ర్యంలో టీవీ8 ప్రారంభం కానుంది. ఈ ఛాన‌ల్ ఏర్పాటుతో మొత్తం 1 నుంచి 10 వ‌ర‌కు ఉన్న అంకెల‌తో మ‌న తెలుగులో న్యూస్ ఛాన‌ల్స్ న‌డుస్తున్నట్టైంది.
ఇక మిగిలిన‌వి ఆక్ష‌రాలే. ఆల్రెడీ ఏ టీవీ, ఏబీఎన్‌, ఈ టీవీ, ఐ న్యూస్, ఎన్ టీవీ, స్టూడియో ఎన్‌, టీ న్యూస్,  జీ టీవీ, సీవిఆర్, వై టివీ ఇలా ఒక 10 అక్ష‌రాలు అయిపోయాయి. కాబ‌ట్టి మిగిలిన 16 అక్ష‌రాలున్నాయి. ఇవికాక ఇప్పుడు ఎక్స్‌ప్రెస్ టీవీ వ‌చ్చింది కాబ‌ట్టి రానున్న రోజుల్లో డీల‌క్స్‌, హైటెక్, గ‌రుడ‌, గ‌రుడ ప్ల‌స్‌, పాసింజ‌ర్ అంటూ పేర్లు పెట్టుకుని పోటీప‌డినా ఆశ్చ‌ర్యం లేదు.
ఆంధ్ర , తెలంగాణా లో ఉండే వాళ్ళకి ఇంకా ఎక్కువ గా తెలుసుందే అవకాశం ఉంది , DTH కన్నా కేబల్ లో ఎక్కువ గా చ్యానెల్స్ వస్తున్నాయి , ఇంకా మీకు తెలుసున్న చ్యానెల్స్ ఉంటే కామెంట్ చెయ్యండి ,  Research చేసి పోస్ట్ పొడిగిద్డాం 

No comments: