Thursday, May 10, 2007

  • తిరిగి రావు

    నా గత పోస్ట్ లో చెప్పినట్టు నిజంగా గతమెంతో ఘనమైనది .. కొన్ని సంఘటనలు జీవితం లో చేరగని ముద్ర వెస్తాయి అవి ఎంత మార్చిపోడమన్న మార్చిపోలేము అటువంటివి తిరిగి రావు

    కొన్ని ఉదాహరణాలు

    చిన్నప్పుడు School మానేసి వర్షం లో Football ఆడిన రోజులు తిరిగి రావు
    School అయిపోగానే ఇంటి పెరట్లో బంతి ఆట (మా అమ్మ క్రిక్కెట్ ని అలాగే అనేది :) ) ఆడుతూ ఎదురుగా ఉన్న హొస్పిటల్ లో Patients ని కొట్టిన రోజులు తిరిగి రావు

    అమ్మ కి సినేమా కి వెళ్తను అని చెప్పి Video game centre లో గంటలు గంటలు కూర్చుని Mario, contra ఆడిన రోజులు తిరిగి రావు

    మా ఊరి లో గోదావరి ఒడ్డున ఇసుక తిన్నేల్లో నేను మా Friend కొట్టుకున్న రోజులు తిరిగి రావు

    School ఎగ్గొత్టి శ్మశనని కి వెళ్ళి కా లూతున్న సవం చూసి పడిపోయిన మా Friend ని మోసుకొచ్చిన రోజులు తిరిగి రావు

    నేను 9th క్లాసు చదువుతుండగా Vizag ట్రిప్ కోసం మొదటి సారి ట్రైన్ ఎక్కి ఆశ్చర్యపొయిన రోజులు తిరిగి రావు

    రోజు పొద్దున్నే Radio లో వార్తలు వింటూ, తర్వాత కొత్త హింది సినేమా ట్రైలర్స్ వినే రోజులు తిరిగి రావు

    మా పెరట్లో రాత్రి మడత మంచం మీద నక్షత్రాలని చూస్తూ పడుకున్న రోజులు తిరిగి రావు

    Intermediate లో NCC కంప్ కి విజయవాడ వెళ్ళి రాత్రి గోడ దూకి బీర్ తాగి కుంకుడు కాయ రసం లా ఉంది అని ఉసిన రోజులు తిరిగి రావు

    ఇవన్ని ఒక ఎత్తు అయితే నా Engineering Life ఇంకొక ఎత్తు ఆది ఒక మహాప్రశ్తానం అంత గ్రంధం అవుతుంది చెప్పుకుంట పోతే.....


మిగతాది తర్వాత పోస్ట్ లో ..............

Wednesday, May 09, 2007

చిన్న నాటి జ్ఞాపకాలు - 3

వీడేంట్రా బాబు ఎక్కడి నుంచో మొదలు పెట్టాడు అనుకుంటున్నారా , ఏమీ లేదు Spiderman-3 అయింది కదా అందుకే నేను కూడా 3rd పార్ట్ రాద్డమని మొదలు పెట్టాను.

చిన్నప్పుటి నుండి నేను ఆ.భా.ని.స లో member ని, ఆ.భా.ని.స అంటే ఏంటి అనుకుంటున్నారా అఖిల భారత నిద్రపోతుల సంఘం (మనకి కొంచెం ఎక్కువ) ..కానీ ఎంత నిద్ర లో ఉన్న Sunday వచింది అంటే చాలు పొద్దున్నే TV ముందు తయారయ్యేవాడిని .. చిన్నప్పుడు మనకి టీవీ అంటే మక్కువ ఎక్కువ !! వచిన ప్రతి ప్రోగ్రామ్ వదలకుండా చూసే వాడిని
బాష బెదమ్ లేకుండా Sunday మద్యననాం ప్రాంతీయ బాష చిత్రం కూడా చూసేవడిని అంటే నమ్మండి.
హింది ప్రోగ్ర్యామ్స్, సీరియల్స్ ,ఆడ్స్ Jingles, వార్తలు .ఒకటీంటి మొత్తం అన్ని చూసేవడిని, బహుశా దాని వల్లే వల్లే నాకు నేను గా హింది నేర్చుకోగలిగాను ఆదివారం నా కార్యక్రమలాన్ని TV ముందరే పళ్లు తోముకుని ఫ్రెష్ అయ్యీ వాచీ కూర్చునే వాడిని మా అమ్మ కోపం తో
ఆ TV వేడి మెళ్ళో వేయండి ఏక్క డికి వెళ్లిన చూస్తూ ఉంటాడు అని తిట్టేదీ , మా వీదీ లో కరేంట్ ఎప్పుడు పోతుందా అనీ అక్క వేయి కళ్ల తో చూసేది పాపం.
నేను DD లో చూసిన ప్రతి ప్రోగ్రామ్ ఇప్పటికీ నాకు గుర్తుంది పొద్దున్న 9 కి జైయంట్ రోబట్ తరువాత మహాభారత్ మద్య నమ్ 3.30 కి World Of Sport, మీలే సూర్ మేర తుమార తరువాత 4 కి వాక్చే తెలుగు సినిమా, ఇవి కాకుండా మా పక్కింటి వల్ల ఇంటికి వెళ్ళి కేబల్ టీవీ కూడా ఇవన్ని మరి చినప్పుడు అన్నంత అంటే 7,8 వరకు 9th క్లాస్ నుంచి రూట్ మారిపోయింది , అదే పని గా పొద్దునుంచి సాయంత్రం వరుకు Cricket ఆడటం తెల్లవారు జామునే లేచి బ్యాడ్‌మింటన్ ఆదేవాడిని స్టేట్ లెవెల్ లో మా District తరుపున ఆడను లెండి.

చిన్ననాటి రోజులు గుర్తుందేవి తక్కువే అయిన అవి గుర్తోచినప్పుడు మనం మళ్లీ చిన్నపిల్లలం అయిపోతాం,
జీవితం అనే పుస్తకం లో బాల్యం అనే పుటా ఒక తీపి జ్ఞాపకం

ఏమంటారు ??
  • గతం

    గతమెంతో ఘనమినది అని పెద్దవాళ్ళు ఊరికే అనలేదు, ఆది చాలా మట్టుక్కు నిజం కాబట్టి. మనిషి గతం లోనే బతుకూతదంతా, మనం అపుడు ఇలా చేశాం అలా చేశాం అని గుర్తు తెచుకుని ఆ తీపి జ్ఞాపకాలతో మిగిలన జేవితం అంత గడుపుతాడాట. ఏమో నా జేవితం జరుగుతూ ఉంటే కానీ నాకు తేలేదు మేకు ఎవరికిన తెలిసిందా??