Wednesday, March 05, 2008

ఇటీవల భారత తంతి తపాల శాఖ వారు విడుదల చేసిన శ్రీ దామోదరం సంజీవయ్యా గారి స్టాంప్ ఇది
గూగుల్ పుణ్యమా అని మరి కాస్త వివరం దొరికింది
దామోరం సంజీవయ్యా ఫిబ్రవరి 4, 1922 లో కర్నూలు జిల్లా పెద్దపాడు అనే కుగ్రామం లో పుట్టారు. శ్రీ మునయ్య శ్రీమతి సూంకుళమ్మ వారి తల్లితండ్రులు. అదే గ్రామం లో పటాశాల వరుకూ చదివి, తర్వాత కర్నూలు లో హై స్కూల్ లో, అటు పిమ్మట అనంతపూర్ లో ఆర్ట్స్ కాలేజ్ నుంచి డిగ్రీ లో పట్టభద్రులయ్యారు. 1950 లో ఆయన మెంబర్ ఒఫ్ పార్లిమెంట్ గా ఎన్నిక కావటం తో ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది, 1952 లో పాతికొండ నియోజకవర్గం నుంచి మదరసు అసెంబ్లీ కి ఎన్నికిన ఇద్దరు వ్యక్తులలో సంజీవయ్యా గారు ఒకరు. అప్పటి ముఖ్యమంత్రి అయిన సీ. రాజగోపాలాచారి గారు ఆయన్ని తన మంత్రి వర్గం లో తీసుకున్నారు. 1953 లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటి ముఖ్యమంత్రి అయిన టంగుటూరి ప్రకాశం గారి హయాము లో కూడా మంత్రి గా పనిచేశారుజవహార్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ మంత్రి వర్గం లో పలు ముఖ్య పదవులు నిర్వర్తించి ఆ పదవులకే వన్నె తెచ్చారు మన తెలుగు తేజం సంజీవయ్యా గారు. లేబర్ మినిస్టర్ గా చేసి ప్రజల మనిషి అనిపించుకున్న గొప్ప వ్యక్తి, సమకాలీన తెలుగు రాజకీయ నాయకుల్లో ఆయన పేరు చిరస్మరణీయం గా మిగిలిపోతుంది.

1 comment:

Lalita said...

Good post to read with ..stamp chudagane identi ani chadivanu ...baga rasav ra...migatvi kuda chadivi coments post chesta..wait