Wednesday, April 15, 2009

ఏ "లక్షణా" లు - II

మీకు తెలుసా !!
తమిళ నాడు లో DMK పార్టీ వాళ్ళు ఫక్తు తమిళ పేర్లు పెట్టుకుంటే ఒక బంగారపు ఉంగరం ఇస్తారుట
ఎలెక్షన్ దగ్గర పదే కొద్ది మన నాయకుల పిచ్చి ముదిరి పాకాన పడింది అనటానికి ఇదొక ఉదాహరణ, తమిళ బాష ని బతికించటానికి మాత్రమే ఈ ఉంగరం స్కీమ్ పెట్టాం అని చెప్పుకుంటునారు ఆ నాయకులు ఇన్ని రోజులు గుర్తూరాని బాష అభినమ్ ఇప్పుడు ఎలా గుర్తు వచిందో ఏలీనా వారికి !!

రాజు తలచుకుంటే దెబ్బలకి కొదవా అనేది పాత మాట రాజకీయ నాయకులు తలచుకుంటే పదకాలకి కొదవా చెప్పండి


ఎలెక్షన్ టైమ్ లో ఓట్ల కోసం నాయకులు ఏమైన చేస్తారు ప్రచారానికి దెన్నిన ఉపయోగించుకుంటారు
అగ్గీపుల్ల కుక్కపిల్ల సబ్బూబిళ్ళ కాదేది కవిత కి అనార్హం అన్నారు శ్రీ శ్రీ గారు

కానీ మన నాయకులు అగ్గిపెట్టె చెట్తబుట్ట రైలుపెట్టె కాదేది ప్రచారానికి అనార్హం అంటున్నారు .. !!!

ఈ కింద ఫోటోలు చూడండి మీకె తెలుస్తుంది










Wednesday, March 18, 2009

ఏ "లక్షణా" లు

ఆంధ్ర లో ఎన్నికల హడావిడి మొదలయ్యింది . నాయకులు, "వి" నాయకులు మైకులు పట్టుకుని రోడ్ షో ల పేరు తో పబ్లిక్ ముందుకు వెళ్తున్నారు . వాళ్ల వాళ్ల ఉక దాంపుడు ఉపన్యసాలతో ప్రజల చెవులు చిరిగిపోయల అరుస్తున్నారు . తమ పార్టీ ఏమీ చేస్తుందో చెప్పడం కంటే పక్క పార్టీ ఏమీ తప్పులు చేసిందో చెప్పటం లో వీళ్ళందరూ సిద్దహస్టులు అనటం లో ఏ మాత్రం సందేహం లేదు.
డబ్బులు సంపాదించటానికి,  ప్రజల నోట్లో నానటానికి మన దేశం లో 3 అత్యంత సులువైన (కొంచెం కస్టమే లెండి...) మార్గాలు ఉన్నాయి.
అవి సినిమా , క్రికెట్ & పాలిటిక్స్
ఈ సారి విశేషం ఏంటి అంటే ఈ మూడు కలిసిపోయాయి              
ఇటు వాళ్ళు అటు అటు వాళ్ళు ఇటు వస్తూనే ఉన్నారు ప్రచారం పేరు తో తిరుగుతూనే ఉన్నారు

ఎవరు ఎవరితో కలుస్టరో, ఎవరు ఎపుడు ఈ పార్టీ లో ఉంటారో దేవుడికే తెలియాలి
లోగుట్తు పెరుమాల్లా కి ఎరుక 

మన ఇంకో 2 నెలలు ఆగితే అందరి జాతకాలు బయట పడతాయి

ఓటు హక్కు ఉన్న వారు దయచేసి మే ఓటు ని వినియోగించామని ప్రార్ధన, అబ్యర్దన

ఈ కింద ఫొటోస్ చూడండి 03/18 వ తారీకున చిరంజీవి కి , NTR కి "సో కాల్డ్ " అభిమానులు ఇచిన బహుమతులు 
వాటి సారూప్యం చూడండి 

బంటూ మిల్లి లో చిరంజీవి కి

Free Image Hosting at www.ImageShack.us


తగరపు వలస లో NTR కి

Image Hosted by ImageShack.us

పూల కిరీటం, చేపలబుట్ట, వల, యాదృుచికమే అయిన ఒకే రోజు ఒకే బహుమతులు 

Thursday, January 22, 2009

ప్రఖ్యాత సీని దర్శకులు జంధ్యాల గారి గురించి సుత్తివేలు గారు  చెప్పిన మాటలు

Friday, November 28, 2008

ఛత్రపతి టైటల్ సాంగ్


అగ్ని స్కలన సంధఘఢరిపు వర్గ ప్రాల్య రాదా ఛత్రపతి
మధ్యంధిన సముధ్యత్ కిరాణా విద్యుద్ధుమనీ ఖానీ ఛత్రపతి
తజ్జెం తజ్జేనూ తాధీం ధీరాన
ధీం ధీం తకిట నట ఛత్రపతి
ఉర్‌వి వలయ సంభవ్యవర స్వాక్చంద గుణాధి...||


||ఖుంభి నికర ఖుంభాస్త
గురు ఖుంభి వలయ పతి ఛత్రపతి
ఝంఝ పావన గర్వపహర వింధ్యద్రి సమాడ్ృుతి ఛత్రపతి
చండ ప్రబల డోఅర్‌ధండజిట ధూర్ధండ భాత తాతి ఛత్రపతి
శత్రు ప్రకార విక్చేదాకర భీమా అర్జున ప్రతి...|| (2)


||ధిగ్ ధిగ్ విజయ ఢంకా
నినాద ఘంటారావ తుస్షఛిత చత్ర్పాతి
సంఘ స్వజన విద్రోహి గణ విధ్వంస వ్రతమటి ఛత్రపతి
ఆర్థత్రన ధూస్తఢ్‌యుమ్న క్షాత్ర స్పుర్తి ధిధిటి,
భీంాక్ష్మాపతి,శిక్ష స్మృతి స్థాపతి....||

Friday, June 06, 2008

చాకి రేవు

US లో మనకి చాలా టైమ్ దొరుకుతుంది, తెగ రాసేద్దం పొడిచెద్దాం అని అనుకున్న

ఏమైనాది ???

అక్కడికి వెళ్ళాక నాకు కొన్ని పదాలు తెలిసాయి చాకిరేవు, కుక్క చాకిరి, ఇలా0టివి అన్నమాట...

నేను వెళ్లే టైమ్ కి ముకేశ్ అక్కడే ఉన్నాడు , వాడు వంట వార్పూ అంటూఏదో సెట్ చేశాడు, ఇంకా Office లో .. మా బాస్ గాడు పాల్, చూడటానికి Nicolas Cage కి కసిన్ బ్రదర్ ల ఉంటాడు, ఎపుడు శోధి వేయటం, టీమ్ నుంచి వేడిని పేకేస్తా వాడిని పేకేస్తా అనటం, లేదా వాళ్ళకి తెలిసిన అతి పెద్ద మరియు కష్టమైనా గేమ్ Baseball గురించి చెప్పటం చేసేవాడు కానీ మంచోడు నను అన్ని Restaurants కి తేసూకెళ్లాడు, తెలుగు వాడి కి ఎక్కడకి వెళ్ళిన ఒక జబ్బు ఉంటుంది Friends కి ఫోన్ చేసి ఎలా ఉనావ్ ఏంటి సంగతులు అని అడిగిన తర్వాత ప్రశ్నలు ఇలా ఉంటాయి "బావ చిరుత ఎలా ఉంది ర? రామ్ చరన్ తెజ్ పనికొస్తడంటావా? NTR ఏంట్రా అంత చిక్కిపోయాడు .వెంకీ ఏంట్రా మూసలోడు అయిపోతునాడు" ఇత్యాది కబుర్లు అన్నమాట, తెలుగు వాడికి సినిమా అంటే అంత పిచీ మరి , ఎపుడు టైమ్ దొరికినా సినిమా చూద్దాం లేదా దానికి సంబందించి వింతలూ వార్తలు తెలుసుకుందాం అనుకుంటాడు.ఇక విషయానికి

వస్తే మనము కూడా పదహరణాల తెలుగు వాళ్ళం కాబట్టి వెంటనే నెట్ మీద పడ్డం, నెట్ లో అంత తిరగేసిన తర్వాత కొన్ని సైట్స్ పట్టుకుని సినెమలు డౌన్ లోడ్ చేసెయాటం పూణే లో విడుదల కు నోచుకోలేని సినెమలు కవర్ చేసెయాటం, రాత్రి అవగానే ఒక ఫోన్ కొట్టి పడుకోవటం ఇది మనం చేసేది, ఇది కాక మా బాసు గాడు ఫోన్ చేసి శోధి వేసేవాడు . మనం శుద్ద శాకహరి కదా( Friends గతం వద్దు, మనం వర్తమానం లో జేవిద్దాం)బోజానం లేదు, దెబ్బ కి దెయ్యం దిగి వాంట్లో ఉన్నత కొవ్వు టైట్యానిక్ ఢీ కొన్నపుడు కరిగిన గ్లేషియర్ లాగా కరిగి పోయింది, ఆ పని కి ఆ బోజనానికి సిస్టమ్ పట్టుకోగానే నీరసం మున్చుకొచెది దానికి తోడు మా ముకీయా గాడు ఒకడు, వీకెండ్ వచింది అంటే చాలు దగ్గర్లో ఉన్న ఇండియన్ రెస్టౌరెంట్స్ కి తీసుకెళ్ళెవాడు, అక్కడ వాడు వరద బాదితులకి ఒక్కసారి గా పది పులిహోర పొట్లాలు దొరికినంత ఆనందం తో, విరగబడి తింటూ ఉంటే వీడు ఇంతే అదో టైప్ అనుకున్న, కానీ సరిగా ఒక నెల తర్వాత నేను కూడా అదే స్తితి కి చేరి వాడి కన్నా ఘోరం గా తింటుంటే అర్దం అయింది . అందరి పరిస్తితి ఇలాగే ఉంది అనుకుంటే మీరు పొరపైనట్టే, చక్కా గా ఫ్యామిలీ వున్నవాళ్లు లేదా కొంత మంది బ్యాచ్లర్స్ ఉంటే వాళ్ళు అన్ని రకాలు మంచి గా వండుకుని మస్తు గా తింటారు,లేదా నాన్ వెగ్ తినేవాళ్ళు అయితే పండగ చేసుకోవచు, మా ముకీయా గాడు ఎగిరేవి, పాకేవి, ఈడేవి, నడిచేవి అన్ని తినేవాడు మనకి Pizza ఉంది కాబట్టి గడిపేశం.

మొత్తానికి Trip అయిపోయి India వచెసాక రాయటం start చెయ్యాల్సి వచింది....

Monday, March 10, 2008

"మహరాస్త్ర లో ఉత్తర భారతీయుల పై, బీహరియుల పై దాడి "

...విషయం చదివి మా కొలీగ్ ముకేశ్ కి చెప్పాను హింది లోకి తర్జుమా చేసి .వాడు దానికి ఒక ఏదవ నవ్వు నవ్వి మా Project Leaderతో డిస్కషన్ పెట్టాడు ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే ముకేశ్ ది బీహార్ , మా Lead ది ఉత్తర ప్రదేశ్ మేము పిచ్ఛపాతి మాట్లాడుకుంటూ ఉండగా అకడికి ఇద్దరు మరాఠీలు వచ్చారు. ప్రతి రాస్త్రం లో ఏదో ఒకటి వర్గం మీదో , లేదా ఏదో ఒక కులం మీదొ లేక పరాయి రాస్త్రం వాళ్ళు నీళ్ళు తీసుకుంటునారని, Dam లు కడుతున్నారు అని గొడవలు జరుగుతూనే ఉన్నాయి.
"తెలుగు జాతి మనది నిండు గా వెలుగు జాతి మనది" ఎందుకో ఆ టైమ్ లో నాకు ఈ పాట గుర్తోచింది అంతే, కూర్చున్న వాడిని కూర్చునట్టు ఉండకుండా ఆంధ్ర లో ఇలాంటి గొడవలు ఉండవు, మా వాళ్ళు చాలా Flexible ఎవరు వచ్చిన కలుపుకుంటారు, నీళ్ళ కోసం గొడవ పడరు అన్నాను. దానివి మా మరాఠి కొలీగ్ అవును ఆంధ్ర లో ఇలాంటి గొడవలు ఉండవు అన్నాడు( ఆది విని నాలో తెలుగు వాడు తెగ ఆనంద పడిపోయాడు) వాళ్ళు వేరే రాస్త్రం వాళ్ళని ఏమీ అనరు. వాళ్ళలో వాళ్లకే పడదు, Factionism అని కొట్టుకుంటారు , ప్రత్యేక రాస్త్రం అంటారు , తెలంగాణా వాళ్ళు ఆంధ్ర వాళ్ళని తిట్టుకుంటారు , ఆంధ్ర వాళ్ళు తెలంగాణా వాళ్ళని తిట్టుకుంటారు ఆంటే కానీ బయట వాళ్ళని ఏమీ అన్నారు అన్నాడు. ఆది విని నాకు నోట మాట రాలేదు , ఒక వెర్రి నవ్వు తప్ప.

అందరు వెళ్ళిపోయాక అలోచించాను వాడు మనల్ని తిట్టాడా లేక పొగిడాదా అని !!!!!!!!!!!!!!!

Wednesday, March 05, 2008

ఇటీవల భారత తంతి తపాల శాఖ వారు విడుదల చేసిన శ్రీ దామోదరం సంజీవయ్యా గారి స్టాంప్ ఇది
గూగుల్ పుణ్యమా అని మరి కాస్త వివరం దొరికింది
దామోరం సంజీవయ్యా ఫిబ్రవరి 4, 1922 లో కర్నూలు జిల్లా పెద్దపాడు అనే కుగ్రామం లో పుట్టారు. శ్రీ మునయ్య శ్రీమతి సూంకుళమ్మ వారి తల్లితండ్రులు. అదే గ్రామం లో పటాశాల వరుకూ చదివి, తర్వాత కర్నూలు లో హై స్కూల్ లో, అటు పిమ్మట అనంతపూర్ లో ఆర్ట్స్ కాలేజ్ నుంచి డిగ్రీ లో పట్టభద్రులయ్యారు. 1950 లో ఆయన మెంబర్ ఒఫ్ పార్లిమెంట్ గా ఎన్నిక కావటం తో ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది, 1952 లో పాతికొండ నియోజకవర్గం నుంచి మదరసు అసెంబ్లీ కి ఎన్నికిన ఇద్దరు వ్యక్తులలో సంజీవయ్యా గారు ఒకరు. అప్పటి ముఖ్యమంత్రి అయిన సీ. రాజగోపాలాచారి గారు ఆయన్ని తన మంత్రి వర్గం లో తీసుకున్నారు. 1953 లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటి ముఖ్యమంత్రి అయిన టంగుటూరి ప్రకాశం గారి హయాము లో కూడా మంత్రి గా పనిచేశారుజవహార్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ మంత్రి వర్గం లో పలు ముఖ్య పదవులు నిర్వర్తించి ఆ పదవులకే వన్నె తెచ్చారు మన తెలుగు తేజం సంజీవయ్యా గారు. లేబర్ మినిస్టర్ గా చేసి ప్రజల మనిషి అనిపించుకున్న గొప్ప వ్యక్తి, సమకాలీన తెలుగు రాజకీయ నాయకుల్లో ఆయన పేరు చిరస్మరణీయం గా మిగిలిపోతుంది.