Friday, November 09, 2007

అమేరిక సంయుక్త రాస్టలు

సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ లో ఆన్‌సైట్ వెళ్ళటం రావటం కొత్త కాకపోయినా కొంత మంది కి మాత్రం ఆది ఒక డ్రీమ్ ల మిగిలిపోతుంది ..నాకు అలాంటి డ్రీమ్ ఉండేది US వెళలి అని.మా మ్యానేజర్ ని నయనో బయనో ఒప్పించి ..వన్ ఫైన్ డే చాన్స్ కొట్తేసాను,మొత్తానికి స్టంపింగ్, ఇంటర్‌వ్యూ గాట్ట్ర అన్ని అయిన తర్వాత నా నంబర్ వచ్చింది ఆ రోజు రానే వచ్చింది ..

ఆ రోజు మామూలుగానే 11 కి స్టార్ట్ అయ్యింది, లేచి సామాన్లు ప్యాక్ చేసుకుని చెకింగ్ అంత చూసుకునే సరికి
టైమ్ అయిపోయింది.నాతో పాటు ఏర్‌పోర్ట్ కి సునీల్ వస్తాను అన్నాడు ఇద్దరం స్టార్ట్ అయ్యాము, ఇంతలో మా డ్రైవర్ బాంబ్ పేల్చాడు , తాను మళ్లీ తిరిగి పూణే రాను అని.తనకి ఇంకొక పికప్ ఉంటుందేమో అన్నాడు, సో అనవసరం గా రిస్క్ ఎందుకు అని నేను సునీల్ ని దిగిపోమని చెప్పాను.అక్కడ నుంచి నేను ఒక్కడినే, ఇంక బొంబాయ్ వెళ్తున్నాత సేపు నా ఫోన్ ఎంగేజ్ లోనే ఉంది :).నా బ్రేక్‌డౌన్ పారిస్ లో, ముంబై నుంచి పారిస్ తరవాత పారిస్ నుంచి బోస్టన్.

ఏర్‌పోర్ట్ కి వెళ్ళిన తరవాత లగేజ్ చూసి ఏమీనా వంకలు పెడటడేమో , ఎక్కువ ఉంది అని పక్కన పడేస్టదేమో అని ఒక టెన్శన్ ఉండేది ఊశ్ ట్రిప్ కన్నా ఈ టెన్శన్ ఎక్కువ అయిపోయింది ...కానీ ఆది కాస్త సులువు గా అయిపోయింది. ..నేను వెళ్ళింది Airfrance లో (ఏ Check In ల్యాగేజ్ లిమిట్ డిఫరెంట్ క్యారియర్స్ కి డిఫరెంట్ గా ఉంటుంది ) ఫ్లైట్ రానే వచింది ..పెద్ద పదవంత ఉంది ఆ ఫ్లైట్, తల తిప్పి ఇటు నుంచి అటు చూసేందుకు సరిపోలేదు .. (నాకు లోకల్ ఫ్లైట్స్ లో తిరిగిన అనుభవం పనికివచింది:)) అంత SET.టేక్ ఆఫ్ అయింది .. విండొ నుంచి కిందకి చూసినప్పుడు మాత్రం ముంబై సిటీ మెరీసిపోయింది, పక్కన సముద్రం ఇంకా మరైన్ డ్రైవ్ క్లియర్ గా కనిపింాయి..
మెల్లిగా ఫ్లైట్ వేగం పుంజుకుంది ..ముందు సీట్ కి అట్యాచ్ చేసిన TV లో మొత్తం సమాచారం వస్తుంది మనం ఎంత ఎత్తులో ఎంత స్పీడ్ వెళ్తున్నది లో డిపార్చర్ అయ్యాక ఏన్ని Miles ఏ దేశం మీద గా వెళ్తున్నాం, రూట్ తో సహా అంత కనిపిస్తుంది, దాదాపు396,893 కిలోలు ఉన్న అంత పెద్ద విమానం అలా సులువుగా ఎగిరిపోతూ ఉంటే రైట్ బ్రదర్స్ కి ఒక salute చేసా. పక్క సీట్స్ మొత్తం ఖాళీ..Flight లో మందు బాగా పొస్తరు పీత లాగా తాగి పెడిపోరా అన్నఫ్రెండ్స్ మాటలు గుర్తోచాయి , కానీ అప్పటికే మనం వనవాసం లోఉన్నాం కదా అని లైట్ తీసుకున్న , కానీ కోతి బుద్ది ఎక్కడికి పోతుంది , ఎవరు రావట్లేదు, సరే అని ఇంకా నిద్ర కి ఉపక్రామిస్తుంటే ఎక్కడినుంచి వచిందో ఒక పెద్ద ఆవిడ(ఒక 40 వుంటేయి లెండి),ఒక తోపుడు బండి మీద ఒక పది రకాల బాటల్స్ వేసుకోచింది , మరి అంత రేంజ్ లో కాకపోయినా స్వర్గ లోకం లో రంబ ఊర్వసి మేనక వచ్చి Janta కి మధువు పోస్టున్న ఫీలింగ్ కలిగింది.ఒక గ్లాస్ వైన్ తెసుకుని పడుకున్న ,9 గంటలు ప్రయాణం , తెలియకుండా అయిపోయింది.పారిస్ వచ్చి0ది, నాకు ట్రాన్సిట్ వీసా (European Union దేశాలలో అడుగు పెట్టాలంటే ఈ వీసా అవసరం) లేదు కాబట్టి ఫ్లైట్ నుంచి Eiffel Tower కనిపిస్తుంది ఏమో అని చూశాను , అబ్బే మొత్తం మంచు దట్టంగా మేఘాలు నేను ముంబై లో రాత్రి 2.45 కి ఎక్కాను , పారిస్ లో దిగేసారికి మార్నింగ్ 8.45 అయింది , నేను గతం నుంచి ట్రావెల్ చేశాను.ఏదో Sci-Fi సినిమా లాగా అనిపించిందీ. జీవితం లో 6 గంటలు కలిసాయి, వెళ్ళేటప్పుడు పోతాయి లెండి. పారిస్ ఏర్‌పోర్ట్ చాలా పెద్దది , పారిస్ లో మొత్తం 4 ఏర్‌పోర్ట్స్ ఉన్నాయి , అందులో పెద్దది ఈ చార్లెస్ దే గావుల్ ఏర్‌పోర్ట్(Charles de Gaulle Airport).తర్వాత connecting ఫ్లైట్ 1.45 కి, అప్పుడు కలుద్దామ్...





1 comment:

Lalita said...

Nuvvu ee muhurtana mumbai city ni varnichavo ....adi kuda marine drive ni ..ade dadi ki guri ayindi ..haha..orike joke ra..feel kaku.

nice post